- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్
Chandrababu Naidu Warns Andhra Pradesh Police| జగన్ రెడ్డి దయాదాక్షిణ్యాల కోసం కొందరు పోలీసులు గాడి తప్పి వైసీపీ కార్యకర్తల్లా మారుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గాడితప్పిన పోలీసు అధికారులను వదిలేది

దిశ, ఏపీ బ్యూరో : Chandrababu Naidu Warns Andhra Pradesh Police| జగన్ రెడ్డి దయాదాక్షిణ్యాల కోసం కొందరు పోలీసులు గాడి తప్పి వైసీపీ కార్యకర్తల్లా మారుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గాడితప్పిన పోలీసు అధికారులను వదిలేది లేదని చంద్రబాబు గట్టిగాహెచ్చరించారు. పోలీసులు ఇంతలా దిగజారి పోయారంటే ఆశ్చర్యంగా ఉందని ట్విటర్ వేదికగా విమర్శించారు. చిత్తూరులో మేయర్ దంపతుల హత్య కేసులో సాక్షులను వేధించి, అక్రమ కేసులు పెట్టడంలో అర్థం ఏమిటి? నేరస్తులను కాపాడుతున్నారా? పోలీసులే పూర్ణ ఇంట్లో గంజాయి బస్తా పెట్టి కేసులు రాయడం దుర్మార్గం అని విమర్శించారు. పోలీసులు చేస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకోడానికి వచ్చిన చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలత మీదికి, మహిళ అని కూడా చూడకుండా పోలీసు జీపు ఎక్కించడానికి ఎంత ధైర్యం? ఎవరి అండ చూసుకుని ఇలా రాక్షసంగా రెచ్చిపోతున్నారు? ప్రభుత్వం చేయించిన ఈ దౌర్జన్యకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. పార్టీ తరపున న్యాయపోరాటం చేస్తాం. రేపు మేము అధికారంలోకి వచ్చాక గాడి తప్పిన ప్రతి అధికారిపై చర్యలు తీసుకుంటాం అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.






