ఏపీ కొత్త మ్యాప్ విడుదల.. 28 జిల్లాలతో రూపుదిద్దుకున్న ఆంధ్రప్రదేశ్!

by Malleboina Mahesh |

అమరావతి రాజధానిగా 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్ విడుదల! మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలతో విపత్తు నిర్వహణ సంస్థ అధికారిక ప్రకటన.

ఏపీ కొత్త మ్యాప్ విడుదల.. 28 జిల్లాలతో రూపుదిద్దుకున్న ఆంధ్రప్రదేశ్!
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) అమరావతి రాజధానిగా రాష్ట్ర సరికొత్త మ్యాప్‌ (New map)ను అధికారికంగా విడుదల చేసింది. గతంలో ఉన్న 26 జిల్లాలకు అదనంగా మార్కాపురం, పోలవరం ప్రాంతాలను కొత్త జిల్లాలుగా గుర్తిస్తూ మొత్తం 28 జిల్లాలతో కూడిన మ్యాప్‌ను రూపొందించారు. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం, అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి పోలవరం జిల్లాలుగా ఏర్పాటు చేసినట్లు ఈ మ్యాప్ ద్వారా స్పష్టమవుతోంది. రాజధాని అమరావతిని కేంద్ర బిందువుగా చూపిస్తూ రూపొందించిన ఈ మ్యాప్, రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో వచ్చిన మార్పులను స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో పాలన మరింత వేగవంతం కానుంది.

Next Story