- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ శాసన మండలి.. టీటీడీ ఛైర్మన్ తొలగింపునకు వైసీపీ వాయిదా తీర్మానం!
by Malleboina Mahesh |
టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడిని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏపీ శాసనమండలిలో వైసీపీ వాయిదా తీర్మానం. సభలో కొనసాగుతున్న వాడీవేడి చర్చ.

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి (Andhra Pradesh Legislative Council)లో గత రెండు రోజులుగా వాడి వేడిగా చర్చ జరుగుతోంది. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో (AP budget meeting) భాగంగా మండలి సమావేశాలు కొనసాగుతుండగా తిరుమల లడ్డూ వ్యవహారం (Tirumala laddu issue)పై చర్చకు పట్టుబట్టారు. ఈ క్రమంలో నిన్న తిరుమల లడ్డు వ్యవహారంపై వాడి వేడి చర్చ జరగ్గా ఈ రోజు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుని తొలగించాలని డిమాండ్ చేస్తూ మండలిలో వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. ఈ రోజు సభ ప్రారంభం కాగానే ఆందోళన చేపట్టారు. దీంతో మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు. అనంతరం వైసీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని మండలి చైర్మన్ పోడియం చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభలో అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది.
Next Story






