IT ఇండస్ట్రీని బెంబేలేత్తిస్తున్న "ఆంథ్రోపిక్స్"... ఏడాదిలో సాఫ్ట్ వేర్ జాబ్స్ మాయం!

by Muthe.Rajitha |

ప్రస్తుతం ఐటీ కంపెనీలను హడలెత్తిస్తున్న ఆంథ్రోపిక్స్ AI ఏజెంట్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

IT ఇండస్ట్రీని బెంబేలేత్తిస్తున్న ఆంథ్రోపిక్స్... ఏడాదిలో సాఫ్ట్ వేర్ జాబ్స్ మాయం!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఐటీ కంపెనీలను హడలెత్తిస్తున్న ఆంథ్రోపిక్స్ AI ఏజెంట్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఒక్క స్టార్ట్ అప్ టాప్ 10 ఐటీ కంపెనీలతో సమానం అని చెబుతున్నారు. అంతేకాదు రానున్న 12 నెలల్లో అన్ని రకాల సాఫ్ట్ వేర్ జాబ్స్ ను రీప్లేస్ చేసే AI మోడల్స్ వస్తాయని ఆంథ్రోపిక్స్ CEO డారియో అన్నారు. ఈ కొత్త AI టూల్ గురించి తెలుసుకుందాం..

అసలేంటీ ఆంథ్రోపిక్స్

ఆంథ్రోపిక్ (Anthropic) అనేది 2021లో స్థాపించబడిన కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న AI కంపెనీ. ఈ కంపెనీని డారియో అమోడీ, ఆయన సోదరి డానియెలా అమోడీ కలిసి ప్రారంభించారు. వీరిద్దరూ గతంలో OpenAIలో టాప్ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేశారు. ఆంథ్రోపిక్ ముఖ్యంగా Claude అనే AI చాట్‌బాట్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ సుమారు 40 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3.3 లక్షల కోట్లు)గా అంచనా వేస్తున్నారు. అమెజాన్, గూగుల్ లాంటి పెద్ద టెక్ కంపెనీలు ఈ స్టార్టప్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఒక స్టార్టప్ అయినప్పటికీ, దీని ప్రభావం ఇండియాలోని పెద్ద ఐటీ కంపెనీలైన TCS, Infosys, Wipro లాంటి వాటితో సమానంగా ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

అంతగా ఏముందీ..??

ఆంథ్రోపిక్ ప్రభావం అంతగా పెరగడానికి కారణం దాని అడ్వాన్స్డ్ AI మోడల్స్. ఇవి కోడింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెస్టింగ్, మెయింటెనెన్స్ లాంటి పనులను చాలా వరకు ఆటోమేటిక్‌గా చేయగలుగుతున్నాయి. ఇండియన్ ఐటీ రంగం ఎక్కువగా అమెరికా క్లయింట్లపై ఆధారపడి ఉండటంతో, ఇలాంటి AI టూల్స్ ఉద్యోగాలకు, ఐటీ కంపెనీలకు పెద్ద ప్రమాదంగా మారబోతున్నాయి. ఇదే కోవలో ఉన్న ఫిబ్రవరి 4న ఆంథ్రోపిక్ కొత్త AI టూల్ విడుదల చేసిన వెంటనే, ఇండియన్ ఐటీ స్టాక్స్ భారీగా పడిపోయాయి. Nifty IT ఇండెక్స్ 5 నుంచి 7 శాతం తగ్గింది. ఇది ఆ కంపెనీకి ఇది 2020 తర్వాత ఇదే అతిపెద్ద పతనం.

ఇండియన్ ఐటీ కంపెనీలకు మరణ శాసనం

ఆంథ్రోపిక్ విడుదల చేసిన కొత్త టెక్నాలజీని Claude 4.5 లేదా Claude AI Agent అని పిలుస్తున్నారు. ఇది సాధారణ చాట్‌బాట్ కాదు. ఇది నిజంగా ఒక "AI ఏజెంట్". అంటే మనిషి కంప్యూటర్‌లో మౌస్, కీబోర్డ్‌తో చేసే పనులన్నింటినీ ఇది చేయగలదు. అంటే కోడ్ రాయడం, బగ్స్ సరిచేయడం, మొత్తం సాఫ్ట్‌వేర్ తయారు చేయడం, డేటా విశ్లేషణ చేయడం, వెబ్ బ్రౌజింగ్ చేయడం, ఫైల్స్ మేనేజ్ చేయడం వంటి పనులు చేయగలదు. ఒక అప్లికేషన్ తయారు చేయమని చెప్పితే.. అది ముందుగా ప్లాన్ చేస్తుంది. తర్వాత కోడ్ రాస్తుంది. టెస్ట్ చేస్తుంది. చివరికి డిప్లాయ్ కూడా చేస్తుంది. అందుకే ఇది ఇండియన్ ఐటీ కంపెనీలకు పెద్ద సవాలుగా మారబోతోందని తెలుస్తోంది.

6 నెలల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు మటాష్

ఆంథ్రోపిక్ CEO డారియో అమోడీ జనవరి 2026లో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే 6 నుంచి 12 నెలల్లో AI సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు చేసే చాలా పనులను లేదా అన్నీ పనులను కూడా చేయగలుగుతుంది అని తెలిపాడు. తన కంపెనీలోనే ఇంజనీర్లు ఇక కోడ్ రాయడం మానేశారని, AI కోడ్ రాస్తే వాళ్లు కేవలం ఎడిట్ చేస్తున్నారని వెల్లడించాడు. దీని వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు పూర్తిగా మారిపోతాయని. చాలా ఉద్యోగాలకు కోత పడుతుందని ఆయన హెచ్చరించాడు.

అతియోశక్తి అంటున్న నిపుణులు

ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీశాయి. ఇండియాలో దాదాపు 50 లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ముఖ్యంగా ఎంట్రీ-లెవల్, రొటీన్ పనులు చేసే ఉద్యోగాలపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే కొందరు టెక్ లీడర్లు మాత్రం ఇది అతిశయోక్తి అని చెబుతున్నారు. AI వల్ల కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని, ఇంజనీర్లు AI ఎడిటర్లు, డిజైనర్లు, సిస్టమ్ ఆర్కిటెక్ట్స్‌గా మారతారని వారు అభిప్రాయపడుతున్నారు.

ఆంథ్రోపిక్ మరియు దాని AI ఏజెంట్లు ప్రపంచ ఐటీ రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఒకవైపు ఉద్యోగ భయం వెంటాడుతుంటే, మరోవైపు టెక్నాలజీ ఊహించనంత మారబోతోందనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. కానీ ఇది ఇండియన్ ఐటీ రంగానికి పెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతుందని మాత్రం ఖఛ్చితంగా తెలుస్తోంది.

Next Story