- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్కారు నిర్లక్ష్యంతో మరో విద్యార్థిని చనిపోయింది.. జాగృతి చీఫ్ కవిత ఫైర్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి (Kamareddy) జిల్లా బాన్సువాడ మండల పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బోర్లం (Borlam) ఎస్సీ గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సంగీత (Sangeetha) ప్రాణాలు కోల్పోయింది. జనవరి 26న నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకల కోసం పాఠశాల సిబ్బంది ఆటోలో ఫర్నిచర్‌ను తెప్పించారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులతో ఆ ఫర్నిచర్‌ను అన్‌లోడ్ చేయించారు. ఈ క్రమంలో సంగీత అనే ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఆటో నుంచి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించగా.. క్షణాల్లో విద్యార్థిని మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు.
కాగా, విద్యార్థిని సంగీత మృతిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) స్పందించారు. బాన్సువాడ మండలంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో చిన్నారి సంగీత మృతి నన్ను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. రిపబ్లిక్ డే వేడుకల కోసం విద్యార్థినులను పని వాళ్లలా మార్చి టెంట్ హౌస్ వాహనం నుంచి కుర్చీలు దించిపిచ్చారని ఆరోపించారు. ఈ సమయంలో ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడిన 8వ తరగతి విద్యార్థిని సంగీత ప్రాణాలు కోల్పోవడం దారుణమని అన్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కారు నిర్లక్ష్యంతో మరో గురుకుల విద్యార్థిని చనిపోయిందని కామెంట్ చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. బిడ్డను కోల్పోయిన సంగీత తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. వారు ఈ దుఃఖం నుంచి కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అంటూ కవిత ట్వీట్ చేశారు.
READ MORE .....






