- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజమండ్రి కల్తీపాల ఘటన.. మరొకరు మృతి
రాజమండ్రి కల్తీపాల విషాద ఘటనలో మరొకరు మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 17కు చేరింది.

దిశ, వెబ్ డెస్క్ : రాజమండ్రి కల్తీపాల విషాద ఘటనలో మరొకరు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఫిబ్రవరిలో వెలుగుచూసిన కల్తీపాల ఘటన ఇంకా బాధితులను వెంటాడుతూనే ఉంది. తాజాగా రాజేంద్రనగర్‌కు చెందిన పిచ్చుక నాగేశ్వరరావు(72) అనే వ్యక్తి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఫిబ్రవరి 16న కల్తీపాలు తాగిన ఆయన, అప్పటి నుండి తీవ్ర అస్వస్థతతో కిడ్నీలు దెబ్బతిని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. వైద్యులు డయాలసిస్ చేస్తూ కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ మరణంతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 17కి చేరడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికీ ఇంకా ముగ్గురు బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, వారిలో ఇద్దరు చిన్నపిల్లలు ఉండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
ఫోరెన్సిక్ మరియు ల్యాబ్ రిపోర్టుల ప్రకారం, ఈ పాలలో 'ఇథిలీన్ గ్లైకాల్' (Ethylene Glycol) అనే అత్యంత విషపూరితమైన రసాయనం కలిసినట్లు అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. పాలను నిల్వ చేసే ఫ్రిజర్‌లో గ్లైకాల్ లీక్ అయ్యి పాల క్యాన్లలో కలవడం వల్లే ఈ ఘోరం జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ విషపూరిత పాలు తాగిన వారిలో ఎక్కువగా వృద్ధులు మరియు చిన్నారులు ఉండటం, వారిలో అనూరియా, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వంటి తీవ్ర లక్షణాలు కనిపించాయి. ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తున్నప్పటికీ, చాలామంది ప్రాణాలు కాపాడలేకపోవడం ఈ రసాయనం యొక్క తీవ్రతను తెలియజేస్తోంది. ఈ ఘటనకు బాధ్యుడైన పాల వ్యాపారి అడ్డాల గణేశ్వరరావును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనధికారికంగా 'వరలక్ష్మి డైరీ' పేరిట పాలను సేకరించి పంపిణీ చేస్తున్న ఆయనపై హత్యతో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.






