- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుక్కల దాడిలో దుప్పి మృతి..
by Kodari Anjali |
మహాముత్తారం మండలంలోని పెగడపల్లి గ్రామంలో వేట కుక్కల దాడిలో దుప్పి గాయపడి మృతి చెందింది.

X
దిశ, మహాముత్తారం: మహాముత్తారం మండలంలోని పెగడపల్లి గ్రామంలో వేట కుక్కల దాడిలో దుప్పి గాయపడి మృతి చెందింది. దుప్పి తలను కోసి వేరు చేసిన ఘటనపై పెగడపల్లి అటవీ శాఖ రేంజ్ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో పెగడపల్లి గ్రామానికి చెందిన రామగిరి దుర్గయ్య దుప్పి తలను కోసినట్లు గుర్తించారు. దీనిపై అటవీ శాఖ అధికారులు అతనిపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశామని పెగడపల్లి రేంజ్ అధికారి డోలి శంకర్ తెలిపారు. అనంతరం చుక్కల దుప్పిని వెటర్నరీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి అటవీ ప్రాంతంలో ఖననం చేశారు.
Next Story






