- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pushpa 2: మరో కొత్త రికార్డు .. యూట్యూబ్‌ని రూల్ చేస్తోన్న ‘పుష్ప 2’ ట్రైలర్..
అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా తెరకెక్కిన మూవీ పుష్ప 2

దిశ, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా తెరకెక్కిన మూవీ పుష్ప 2 ( pushpa 2) ఈ సినిమా ట్రైలర్ ఆదివారం సాయంత్రం రిలీజ్ అయింది. బీహార్ పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించగా నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం గ్యారంటీ అన్నట్లు తెలుస్తుంది. ప్రతీ డైలాగ్ థియేటర్లలో పేలడం పక్కా అని అంటున్నారు.
పుష్ప కి ( pushpa ) మించి పుష్ప 2 ఉండబోతుందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇప్పటికి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు తగ్గేదే లే అనే డైలాగ్ వాడుతూనే ఉంటారు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఇంకో రేంజ్ లో మూవీ ఉంటుందని అర్ధమవుతుంది. యూట్యూబ్‌లో ‘పుష్ప ది రూల్’ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి 150 మిలియన్లకు పైగా వ్యూస్, 3 మిలియన్ల పైగా లైక్స్‌తో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఫోటో షేర్ చేసింది.






