People's Media Banner: పీపుల్స్ మీడియా బ్యానర్‌పై మరో కొత్త సినిమా.. ఆసక్తికరంగా ఆకట్టుకుంటోన్న పోస్టర్

by sudharani |   (  Updated:2024-10-26 14:27:19  IST  )

పట్టణ శివారులో గల ప్రసిద్ధిగాంచిన (famous) కొండల్లో వెలసిన ఆంజనేయస్వామి పేరుతో ‘రణమండల’ (Ranamandala) అనే కొత్త సినిమా రాబోతుంది.

Peoples Media Banner: పీపుల్స్ మీడియా బ్యానర్‌పై మరో కొత్త సినిమా.. ఆసక్తికరంగా ఆకట్టుకుంటోన్న పోస్టర్
X

దిశ, సినిమా : పట్టణ శివారులో గల ప్రసిద్ధిగాంచిన (famous) కొండల్లో వెలసిన ఆంజనేయస్వామి పేరుతో ‘రణమండల’ (Ranamandala) అనే కొత్త సినిమా రాబోతుంది. నేడు ఈ మూవీ టైటిల్ (Title)ను అనౌన్స్ చేస్తూ.. అదిరిపోయే పోస్టర్ (poster)ను రిలీజ్ చేశారు పీపుల్స్ మీడియా (People's Media) టేక్ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad). స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియా (media)తో ముచ్చటించారు. ‘నేను జన్మించినటువంటి ఆదోని మండల వాసిగా ఈ చిత్రాన్ని ఈకొండల్లో రణమండల అనే టైటిల్‌తో రూపొందించేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ (huge budget)తో త్వరలోనే విడుదల చేస్తాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదోని జనసేన పార్టీ (Janasena Party) ఇంచార్జ్ నాయకర్ మల్లప్ప, పట్టణ అధ్యక్షుడు మలిశెట్టి రేణు వర్మ, విక్రమ్, ఐ సి రాకేష్, ఉప్పర రాజేష్, పులి రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story