- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. మరో 26 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీ(Maoist Party)కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు ఎస్పీ కిరణ్ చవాన్(SP Kiran Chavan) ఎదుట లొంగిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ(Maoist Party)కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు ఎస్పీ కిరణ్ చవాన్(SP Kiran Chavan) ఎదుట లొంగిపోయారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిపై రూ.64లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. మన్యంలో మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని, పునరావాసంతో పాటు రివార్డులు అందజేస్తామని ఎస్పీ కోరారు. కాగా, లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా మావోయిస్టు పార్టీకి చెందిన మార్వార్ డివిజన్ మరియు PLGA (Peoples Liberation Guerrilla Army) కమిటీ సభ్యులని తెలిపారు. ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల వరుస లొంగుబాట్లు, భీకర ఎన్‌కౌంటర్లు జరగడంతో చేసేదేంలేక లొంగిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.






