- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు.. అనుమతి లేని దీక్షే కారణం!
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులో మరో కేసు నమోదైంది. అనుమతి లేకుండా కలెక్టరేట్ వద్ద దీక్ష చేపట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు నగరంపాలెం పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu)కు గుంటూరు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆయనపై మరోసారి కేసు నమోదు చేశారు. ఇటీవల తన నివాసం, కార్యాలయం పై జరిగిన దాడిని నిరసిస్తూ, బాధ్యులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గత శనివారం (ఏప్రిల్ 18, 2026) గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష (Hunger strike) చేపట్టారు. అయితే, ఈ నిరసన కార్యక్రమానికి పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకపోవడమే కేసు నమోదుకు దారితీసింది. కలెక్టరేట్ వంటి రద్దీ ప్రాంతంలో ముందస్తు అనుమతి లేకుండా దీక్ష నిర్వహించడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని పోలీసులు పేర్కొన్నారు.
నిబంధనలను అతిక్రమించి బహిరంగ ప్రదేశంలో ఆందోళన చేపట్టినందుకు గానూ గుంటూరు నగరంపాలెం పోలీసులు అంబటి పై కేసు ఫైల్ చేశారు. కొన్ని రోజుల సీఎం చంద్రబాబు పై చేసిన అనుచిత వ్యాఖ్యల చేశారు. ఈ కారణంగా గుంటూరులోని తన అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారని, ఈ ఘటనలో స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి దంపతుల ప్రమేయం ఉందని అంబటి ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ ఆయన ఈ దీక్షకు దిగారు. ఈ నెలలో ఆయనపై పలుమార్లు కేసులు నమోదు కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఏప్రిల్ ప్రారంభంలో ఒక వార్తా సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన చేసినందుకు, అలాగే ముఖ్యమంత్రిపై వ్యాఖ్యల విషయంలోనూ ఆయనపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.






