- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టులకు మరో బిగ్ షాక్.. సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో వాహనాలపై ‘Press’ అనే పదాన్ని వాడే విషయంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వాహనాలపై ‘Press’ అనే పదాన్ని వాడే విషయంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రిడిటేషన్ కార్డులు (Accreditation Cards) ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ‘Press’ అని రాసుకోవాలని స్పష్టం చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్ మోటార్ వెహికల్ చట్టం 1989 ప్రకారం అనధికారికంగా వాహనాలపై లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లపై ‘Press’ అనే పదాన్ని వాడటం చట్టరీత్యా నేరమని అధికారులు పేర్కొన్నారు. చాలా మంది వ్యక్తులు తప్పుడు మార్గాల్లో, ప్రైవేట్ సంస్థల గుర్తింపు కార్డులతో ఈ లోగోలను వాడుతున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
జిల్లా అధికారులకు ఆదేశాలు..
సమాచార శాఖ కమిషనర్ జారీ చేసిన ఈ మెమో ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అందరు జిల్లా పౌర సంబంధాల అధికారులు (DPROs) తమ పరిధిలో ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా అక్రిడిటేషన్ కార్డులు లేని వారు ఎవరైనా తమ వాహనాలపై ఉన్న ‘Press’ లోగోలను వెంటనే తొలగించాలని సూచించారు. ప్రస్తుతం అనేక మీడియా సంస్థలలో పనిచేస్తున్న జర్నలిస్టులు తమ సంస్థలు ఇచ్చిన ఐడీ కార్డులను ఆధారం చేసుకుని వాహనాలపై ప్రెస్ స్టిక్కర్లు వాడుతున్నారు. అయితే తాజా ఉత్తర్వులతో అక్రిడిటేషన్ లేని వారందరికీ ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అయితే, నకిలీ జర్నలిస్టులను అరికట్టడానికి, అసలైన జర్నలిస్టులకు గుర్తింపునిచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిబంధనలు అతిక్రమించిన వారిపై రవాణా శాఖ, పోలీస్ శాఖ ద్వారా జరిమానాలు విధించే అవకాశం కూడా ఉంది.
Read More... తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మీడియా అక్రిడిటేషన్ నిబంధనల్లో సవరణలు






