- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహానగరంలో మరో దారుణం.. మద్యం గ్లాసు కోసం అన్నను చంపిన తమ్ముడు
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో మరో దారుణం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. కేవలం ఒక మద్యం గ్లాసు కోసం జరిగిన గొడవ, ఒకరి ప్రాణం తీయడమే కాకుండా.. ఒకే కుటుంబంలో తీరని శోకాన్ని నింపిన ఘటన నాచారం (Nacharam) పోలీస్ స్టేష్టన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నాచారం ప్రాంతంలో నివసించే ఇద్దరు అన్నదమ్ములు నిన్న అర్ధరాత్రి తమ నివాసంలోని మూడంతస్తుల భవనంపై మద్యం సేవిస్తున్నారు.
ఈ క్రమంలోనే మద్యం పోసుకునే గ్లాసు విషయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వివాదం మొదలైంది. మద్యం మత్తులో ఉన్న అన్నదమ్ముల మధ్య మాటమాట పెరిగింది తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన తమ్ముడు, క్షణికావేశంలో అన్నను భవనం పైనుంచి కిందకు తోసేశాడు. మూడంతస్తుల ఎత్తు నుంచి కింద పడటంతో అన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. స్థానికుల సమాచారం మేరకు నాచారం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడైన తమ్ముడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.






