- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళ సీఎం పేరు ప్రకటన వాయిదా
కేరళ ముఖ్యమంత్రి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : కేరళ ముఖ్యమంత్రి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ ఉత్కంఠతకు తెర దించుతూ, ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటనను ఏఐసీసీ (AICC) అధికారికంగా వాయిదా వేసింది. తాజా సమాచారం ప్రకారం, కేరళ సీఎం అభ్యర్థి పేరును మే గురువారం నాడు వెల్లడించనున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. వాస్తవానికి ఈరోజే పేరును ప్రకటించాలని భావించినప్పటికీ, చివరి నిమిషంలో చర్చలు ముగియకపోవడంతో ఈ నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేశారు.
ఇటీవలి ఎన్నికల్లో యుడిఎఫ్ (UDF) భారీ మెజారిటీతో విజయం సాధించినప్పటికీ, సీఎం పీఠం కోసం ముగ్గురు ఉద్ధండ నాయకుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. సీఎం రేసులో ప్రధానంగా పార్టీ హైకమాండ్ మద్దతు ఉన్న కె.సి. వేణుగోపాల్, క్షేత్రస్థాయిలో బలమైన పట్టున్న ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్, అలాగే సీనియర్ నాయకుడు రమేష్ చెన్నిత్తల ఉన్నారు. ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్య సయోధ్య సాధించేందుకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు జరిపిన చర్చలు తుది దశకు చేరుకున్నాయి. దీంతో రేపు ప్రకటించబోయే పేరు కేరళ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.






