ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్ర

by Malleboina Mahesh |   (  Updated:2026-04-21 10:59:00  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్రను ప్రభుత్వం నియమించింది. నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్ర
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్ర (Anil Chandra as Election Commissioner) నియమితులయ్యారు. గత నెలాఖరుతో (మార్చి 31, 2026) మునుపటి ఎస్‌ఈసీ నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో, ఆ స్థానంలో అనిల్ చంద్రను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్ చంద్ర ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకున్న అపారమైన పరిపాలనా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.

నీలం సాహ్ని పదవీకాలం ముగిసిన వెంటనే ఈ నియామక ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. రాజ్యాంగబద్ధమైన ఈ పదవిలో ఆయన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర ఎన్నికల ప్రక్రియలను పర్యవేక్షించనున్నారు. ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన అనిల్ చంద్ర, రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితాల రూపకల్పన, ఎన్నికల నిబంధనల అమలుపై దృష్టి సారించనున్నారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్న తరుణంలో, కొత్త ఎస్‌ఈసీ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం పర్యటన.. మంత్రి గన్ సియో హువాంగ్‌తో భేటీ

Next Story