Grama Ward Sachivalayam: సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలు భారీగా పెంపు

by Disha Web Desk 4 |
Andhra Pradesh Government Issues Grama Ward Sachivalayam Probation Declaration Order
X

దిశ, డైనమిక్​ బ్యూరో: Andhra Pradesh Government Issues Grama Ward Sachivalayam Probation Declaration Order| గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్​కు​ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేస్తూ శనివారం జీవో విడుదల చేసింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది. అలాగే.. సచివాలయ ఉద్యోగుల పే స్కేల్ ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. పంచాయతీ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీ లకు బేసిక్ పే రూ. 23,120 నుంచి రూ. 74,770 ఖరారు చేయగా.. ఇతర సచివాలయ ఉద్యోగులకు బేసిక్ పే రూ. 22,460 నుంచి రూ. 72,810 ఖరారు చేసింది.


Also Read: ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌‌ను ప్రారంభించిన టాటా..

Next Story