‘SDT18’: సాయిధరమ్ తేజ్ చిత్రంలో చాన్స్ కొట్టేసిన అనన్య నాగళ్ల.. చీరకట్టు-బొట్టుతో ఆకట్టుకుంటోన్న పోస్టర్ రిలీజ్..!!

by Kodari Anjali |   (  Updated:2024-11-13 11:34:40  IST  )

సైడ్ క్యారెక్టర్ రోల్స్‌ చేస్తూ సినీ ఇండస్ట్రీలో రాణిస్తోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల వకీల్ సాబ్ చిత్రంతో మరింత ఫేమ్ దక్కించుకుంది.

‘SDT18’: సాయిధరమ్ తేజ్ చిత్రంలో చాన్స్ కొట్టేసిన అనన్య నాగళ్ల.. చీరకట్టు-బొట్టుతో ఆకట్టుకుంటోన్న పోస్టర్ రిలీజ్..!!
X

దిశ, వెబ్‌డెస్క్: సైడ్ క్యారెక్టర్ రోల్స్‌ చేస్తూ సినీ ఇండస్ట్రీలో రాణిస్తోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల(Ananya Nagalla) వకీల్ సాబ్(Vakil Saab) చిత్రంతో మరింత ఫేమ్ దక్కించుకుంది. ఇక అప్పటి నుంచి ఈ అమ్మడు కీలక పాత్రల్లో నటిస్తూ.. ప్రేక్షకులను అలరించే పనిలో పడింది. దర్శక, నిర్మాతలు కూడా అనన్య నాగళ్లకు వరుస అవకాశాలు ఇస్తున్నారు. ఇటీవల పొట్టేల్(Poṭṭēl) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆడకపోయినా.. అనన్య పాత్రకు మాత్రం అభిమానులు వంద శాతం మార్కులిచ్చారు. ఇక తాజాగా ఈ బ్యూటీ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్(Saidharam Tej) చిత్రంలో అవకాశం కొట్టేసింది.

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న SDT18 సినిమాలో అనన్యకు చాన్స్ ఇచ్చినట్లు చిత్రబృందం అఫిషీయల్‌గా అనౌన్స్ చేసింది. ‘విభిన్న పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను చాటుతోన్న ప్రతిభావంతురాలు అనన్య నాగళ్లను వెల్కమ్’’ అంటూ ఎస్‌డీటీ18 టీమ్ ట్విట్టర్ వేదికన రాసుకొస్తూ ఈ హీరోయిన్ పోస్టర్ పోస్టర్‌ను వదిలారు. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోన్న ఈ పోస్ట‌ర్‌లో మల్టీటాలెంటెడ్ అమ్మాయి అనన్య చీరకట్టు, బొట్టుతో.. చిన్నగా స్మైల్ ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ SDT18 పై భారీ అంచనాలు పెంచుతుంది.

Next Story