Anand Mahindra: ఇది వాడితే భారత్ ప్రపంచ శక్తిగా మారుతుంది.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్

by Dishafeatures2 |
Anand Mahindra: ఇది వాడితే భారత్ ప్రపంచ శక్తిగా మారుతుంది.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాల ముందు ఉన్న అతి పెద్ద సమస్య విద్యుత్. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలను అవలంభిస్తున్నాయి. కానీ విద్యుదుత్పత్తి తీరని సమస్యగా మారింది. ఈ క్రమంలోనే సరికొత్తగా వచ్చిన ఓ ఇన్వెన్షన్‌ను ప్రస్తావిస్తూ దిగ్గజ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో భారత రహదారుల, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ట్యాగ్ చేశారు. అయితే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఇస్తాంబుల్ టెక్నికల్ యూనివర్సిటీ వారు తయారు చేసిన అత్యాధునిక పరికరం గురించి ఆనంద్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 'ఈ పరికరం ఇస్తాంబుల్ టెక్నికల్ యూనివర్సిటీ వారు తయారు చేశారు. ఇది ఓ అద్భుతం.

ఇది కేవలం తన పక్కనుంచి వెళ్లే వాహనాల ద్వారా వచ్చే గాలితో కరెంట్‌ను ఉత్పత్తి చేస్తోంది. దీనిని ఇండియాలోని ట్రాఫిక్‌లో వినియోగిస్తే మనం ప్రపంచంలోనే అతి పెద్ద శక్తిగా మారవచ్చు. మన హైవేలపై వీటిని ఉపయోగించి ఇందులో ఎంత నిజముందో తెలుసుకోవచ్చు నితిన్ గడ్కరీ జీ' అంటూ ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనికి మన ట్రాఫిక్‌తో మన ప్రపంచ శక్తిగా కాదు.. విశ్వ శక్తిగా మారొచ్చు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు నిజంగా ఇదో అద్భుతం.. ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించిందంటే ఇది పక్కాగా గొప్ప ఇన్వెన్షన్ అంటున్నారు. మరి దీనిపై గడ్కరి స్పందిస్తారో లేదో చూడాలి.



Next Story