- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, మల్యాల: మల్యాల మండలంలోని రాజారాం బస్టాండ్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు మల్యాల ఎస్ఐ మంద చిరంజీవి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల డిపోకి చెందిన టీఎస్ 21 జడ్ 0060 అనే నంబర్ గల ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి జగిత్యాల వైపుకు వస్తున్న క్రమంలో అదే సమయంలో రోడ్డు దాటుతున్న సుమారు 60 ఏళ్ల వయస్సు గల వృద్ధుడిని ఢీకొట్టింది.
తీవ్రంగా గాయపడిన అతడు సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సర్పంచ్ ఎడిపెల్లి సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృత దేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే మల్యాల పోలీసులను సంప్రదించాలని సూచించారు.






