అమూల్ పాల ధరలు పెంపు

by Muthe.Rajitha |

ప్రముఖ డైరీ బ్రాండ్ అమూల్ (GCMMF) పాల ధరలు పెరిగాయి.

అమూల్ పాల ధరలు పెంపు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ డైరీ బ్రాండ్ అమూల్ (GCMMF) పాల ధరలు పెరిగాయి. అమూల్ తన అన్ని రకాల పాల వేరియంట్లపై దేశవ్యాప్తంగా లీటర్‌కు 2 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ కొత్త ధరలు మే 14 నుండి అమలులోకి వస్తాయని పేర్కొంది. పాల ఉత్పత్తికి అయ్యే వ్యయం పెరగడం, పశుగ్రాసం ధరలు, రవాణా ఖర్చులు అధికం కావడం వల్లే ఈ ధరల పెంపు తప్పలేదని అమూల్ సంస్థ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం సామాన్య ప్రజల నిత్యావసర ఖర్చులపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

Next Story