Yashwant Sinha Hyderabad Tour: యశ్వంత్ సిన్హా రాకకు భారీ ఏర్పాట్లు.. బేగంపేట నుంచి జలవిహార్ వరకు భారీ ర్యాలీ

by Malleboina Mahesh |   (  Updated:2022-06-30 08:46:03  IST  )

Amid Presidential Candidate Yashwant Sinha Hyderabad Tour, KTR met Greater MLAs| విపక్ష రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Amid Presidential Candidate Yashwant Sinha Hyderabad Tour, KTR met Greater MLAs
X

దిశ, తెలంగాణ బ్యూరో : Amid Presidential Candidate Yashwant Sinha Hyderabad Tour, KTR met Greater MLAs| విపక్ష రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బేగంపేట నుంచి జలవిహార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో ఘన స్వాగతం పలికేందుకు టిఆర్ఎస్ అని ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగానే గురువారం గ్రేటర్ ఎమ్మెల్యేలతో బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు వివరించారు. ఎమ్మెల్యేలకు వివిధ బాధ్యతలు అప్పగించారు. జలవిహార్ లో భేటీ తర్వాత భోజనం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సైతం రెండో తేదీన ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీలో ఏం నిర్ణయాలు తీసుకుంటారు.. అనంతరం మీడియా సమావేశంలో ఏం మాట్లాడతారని దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత దేశ రాష్ట్ర రాజకీయాలను నేపథ్యంలో యశ్వంత్ సిన్హా‌తో పాటు కేసీఆర్ ఏం నిర్ణయం వెల్లడిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. టిఆర్ఎస్తో భేటీ తర్వాత కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఫ్లెక్సీలు యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే యశ్వంత్ సిన్హా రాష్ట్రానికి వస్తున్నాడు.. ఎలాంటి పరిణామాలు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story