పాకిస్థాన్‌కు భారీ షాకిచ్చిన అమెరికా

by Muthe.Rajitha |

పాకిస్థాన్‌కు వీసాల జారీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

పాకిస్థాన్‌కు భారీ షాకిచ్చిన అమెరికా
X

దిశ, వెబ్ డెస్క్ : ఎప్పుడూ ఏదోక వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌కు వీసాల జారీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే తమ దేశంలోకి అక్రమ వలసలు నియంత్రించడమే లక్ష్యంగ జనవరి 21 నుంచి సుమారు 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగులను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు అమెరికా వెల్లడించింది. ఈ జాబితాలో పాకిస్థాన్‌ తోపాటు, బ్రెజిల్, రష్యా, ఇరాన్, ఆఫ్గనిస్తాన్, సోమాలియా సహా అనేక దేశాలున్నాయి. అయితే గత కొంతకాలంగా అగ్రరాజ్యం అండ చూసుకొని రెచ్చిపోతున్న పాక్ కు ఇది భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. కాగా ఈ వ్యవహారంపై ఇంతవరకు పాక్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.

Next Story