- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైర్ సెఫ్టీ యాక్ట్ పై సవరణ
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రమాదాలు ప్రాణనష్టాలను దృష్టిలోఉంచుకొవాలని చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రమాదాలు ప్రాణనష్టాలను దృష్టిలోఉంచుకొవాలని చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈక్రమంలో ఫైర్ సెఫ్టీ యాక్ట్ పై సవరణ చేపట్టనున్నట్లు నివేదికను కేంద్రానికి ప్రభుత్వం ప్రతిపాదన పంపనుంది. సెక్రటేరియట్‌లో సీఎస్ రామకృష్ణ రావు నేతృత్వంలో హోం శాఖ స్పెషల్ సెక్రరటి, సీఎంవో అధికారులు శేషాద్రి ,ఫైర్ సెఫ్టీ డీజీ విక్రమ్ మాన్ సింగ్ బుధవారం సమావేశమయ్యారు. ఫైర్ సెఫ్టీ యాక్ట్ సవరణలో - సెల్ఫ్ డిక్లేరేషన్ తప్పని చేస్తు నిబంధన పెట్టాలని ప్రతిపాదన చేసినట్లు తెలుస్తుంది. శిథిలావస్థలో ఉన్నా భవనాలను అసురక్షితంగాప్రకటించడం, నిబంధనలు పాటించని భవనాలను సీజ్ చేయడం - జరిమానాలువిధించడం వంటీ ప్రతిపాదనలు పేర్కోన్నట్లు సమాచారం . 15అంతస్థల లోపు భవనాలకు ఫైర్ సెఫ్టీ నిబంధనలో తీసుకురావడం వంటీ చర్యలు చెపట్టేందుకు కార్యచరణ చేయడం జరిగినట్లు తెలుస్తుంది. గత సెప్టెంబర్ నుంచి ఫైర్ సెఫ్టీ యాక్ట్ సవరణ పై రాష్ట్ర ప్రభుత్వం యోచనలో ఉన్నట్లు ఫైర్ సెఫ్టీ అధికారులు తెలుపుతున్నారు.






