నేను చంద్రబాబును తిట్టలేదు.. అంబటి రాంబాబు వివరణ

by Gantepaka Srikanth |

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

నేను చంద్రబాబును తిట్టలేదు.. అంబటి రాంబాబు వివరణ
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు(Chandrababu)పై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను చంద్రబాబును తిట్టలేదు. నన్ను తిట్టారనే నేను తిరిగి తిట్టాను. ఈ వ్యవహారంలో అరెస్ట్ చేసినా నాకేం ఇబ్బంది లేదు. ఎవరికీ భయపడే వ్యక్తిని కాదు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కూడా తీసుకోను. కానీ నా టైం వచ్చినప్పుడు ఎవరినీ వదలను. చంద్రబాబుపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటా. నాపై దాడి చేసేందుకు టీడీపీ శ్రేణులు వచ్చినా పోలీసులు అడ్డుకోలేదు. ఇదంతా దృష్టిలో పెట్టుకుంటాను’ అని అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అంబటి రాంబాబుపై మంత్రి పార్థసారథి, టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తండ్రిని ఉద్దేశించి అంబటి చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని పార్థసారథి విమర్శించారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి ఏర్పడింది. బేషరతుగా రాంబాబు క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్‌ చేశారు.

Next Story