- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలిస్సా హీలీ వీడ్కోలు ఇన్నింగ్స్.. టీమ్ ఇండియాపై ఆస్ట్రేలియా పరుగుల సునామీ!
"హోబర్ట్ వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు పరుగుల ప్రభంజనం సృష్టించింది. కెప్టెన్ అలిస్సా హీలీ వీడ్కోలు ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో చెలరేగగా, బెత్ మూనీ కూడా శతకంతో మెరిసింది. వీరిద్దరి ధాటికి భారత్ ముందు 410 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది.

దిశ, వెబ్ డెస్క్: భారత మహిళా, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య హోబర్ట్ వేదికగా మూడో వన్డే మ్యాచ్ (Third ODI match) జరుగుతోంది. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఫోర్లు సిక్సర్లతో రెచ్చిపోయారు. సొంత గడ్డపై బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. తన చివరి వన్డే ఇన్నింగ్స్ ఆడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ (Alyssa Healy 158 runs off 97 balls) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. మొదటి నుంచి భారత బౌలర్లపై విరుచుకుపడిన హీలీ, మైదానం నలుమూలలా 27 ఫోర్లు, 2 సిక్సర్లతో విజువల్ ట్రీట్ అందించింది. ఆమెకు తోడుగా యువ ఓపెనర్ జార్జియా వోల్ (62) స్టార్ బ్యాటర్ బెత్ మూనీ (106 not out) కూడా అద్భుతమైన శతకంతో మెరవడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఈ మ్యాచులో భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆసీస్ బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. స్నేహ రాణా 2 వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకోగా, శ్రీ చరణికి కూడా 2 వికెట్లు దక్కాయి. ఇప్పటికే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా, ఈ భారీ స్కోరు తో క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తోంది. 410 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న భారత్, ప్రపంచ ఛాంపియన్ హోదాలో ఈ క్లిష్టమైన లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందో చూడాలి. అలాగే మూడు మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ లో ఇప్పటికే 2 మ్యాచుల్లో ఓడిపోయిన భారత్ సిరీస్ ను చేజార్చుకుంది. మరీ ఈ మ్యాచులో అయిన గెలిచి పరువు కాపాడుకుంటుందా లేదా తెలియాలంటే ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.






