Allu Arjun: కోట్ల డబ్బును తిరస్కరించిన బన్నీ.. అభిమానుల కోసమేనట!

by Disha Web Desk |
Allu Arjun: కోట్ల డబ్బును తిరస్కరించిన బన్నీ.. అభిమానుల కోసమేనట!
X

దిశ, సినిమా : గతంలో ఫెయిర్‌నెస్ యాడ్ చేసేందుకు ఓ కంపెనీ రూ.2 కోట్లు ఆఫర్ చేసినప్పటికీ హీరోయిన్ సాయి పల్లవి తిరస్కరించిన విషయం తెలిసిందే. ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రమోషన్‌ వల్ల ఎంతో కొంత నెగెటివిటీ స్ప్రెడ్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆమె ఇలా చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కూడా ఓ పొగాకు(Tobacco) కంపెనీ భారీ మొత్తం ఇచ్చేందుకు ముందుకొచ్చినా.. మరో ఆలోచన లేకుండా సదరు అడ్వర్టయిజ్మెంట్‌కు నో చెప్పాడు. ఈ యాడ్ చూసి తన అభిమానులు పొగాకు(Tobacco) అలవాటు చేసుకోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. సినిమాల్లో ధూమపానం, మద్యపానం సేవించడం తన కంట్రోల్‌లో లేదు కానీ రియాలిటీలో పొగాకు తీసుకోకూడదనే ప్రచారం చేస్తానంటున్నాడు బన్నీ. ఇక తన డెసిషన్‌ను అభిమానులతో పాటు ప్రముఖులు కూడా ప్రశంసిస్తూ ఇండస్ట్రీలో ఇలాంటి మార్పు రావాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed