Rakul Preet singh: టాలీవుడ్‌లో అతడే నా ఫేవరెట్ హీరో

by Disha Web Desk 19 |
Rakul Preet singh: టాలీవుడ్‌లో అతడే నా ఫేవరెట్ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబీ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సినీ ఇండస్ట్రీకి రంగ ప్రవేశం చేసి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసనా నటించిన ఈ హాట్ బ్యూటీ.. కొన్నాళ్ల పాటు టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌ స్టేటస్‌లో కొనసాగింది. తన హాట్‌నెస్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకన్న రకుల్.. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రాక బాలీవుడ్ బాట పట్టింది.

బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమాయాణం సాగిస్తూ అక్కడికే మకాం మార్చింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ హాట్ ఫొటోలతో అభిమానులకు టచ్‌లో ఉండే ఈ భామ.. తాజాగా నెటిజన్లతో చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ హాట్ బ్యూటీ నెటిజెన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. అయితే ఓ అభిమాని టాలీవుడ్‌లో మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడగగా.. టాలీవుడ్‌లో నా అభిమాన నటుడు అల్లు అర్జున్ అని తెలిపింది. బాలీవుడ్‌లో రణ్ వీర్ సింగ్ అంటే ఇష్టమని.. అంతేకాకుండా సమంతా అంటే కూడా చాలా ఇష్టమని.. నేను అభిమానించే వాళ్లలో సామ్ ముందుంటుందని చెప్పింది.

Anasuya: మీరే మగజాతి పరువు తీస్తున్నారు.. అనసూయ ట్వీట్ వైరల్



Next Story