- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News: బ్రతికినంతకాలం జగన్ అన్నతోనే ఉంటా : ఆళ్ల రామకృష్ణారెడ్డి
దిశ, ఏపీ బ్యూరో : మంత్రి పదవి వచ్చినా రాకపోయినా నేను సీఎం జగన్‌తోనే ఉంటానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.

దిశ, ఏపీ బ్యూరో : మంత్రి పదవి వచ్చినా రాకపోయినా నేను సీఎం జగన్‌తోనే ఉంటానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. పదవి ఇచ్చినా..ఇవ్వకపోయినా మంత్రి పదవికే కంటే జగనన్న మనస్సులో స్థానమే నాకు ముఖ్యం. పదవుల కోసం బాధపడాల్సిన అవసరం లేదు. నేను జగనన్న సైనికుడునీ రాజన్న వారసులని జగనన్న మాటకు కట్టుబడి ఉన్నాను. రాజకీయాల్లో ఉంటే జగనన్నతోనే ఉంటాను. రాజకీయాలు వదులుకుంటే నా పొలంలో పని చేసుకుంటాను అని ఆనాడే అసెంబ్లీ సాక్షిగా వెల్లడించాను. నేను బ్రతికినంత కాలం జగన్ బాటలో జగన్‌తోనే ఉంటా అని ఎమ్మెల్యే ఆర్కే చెప్పుకొచ్చారు. ఇకపోతే మంత్రివర్గ విస్తరణకు 5నెలల ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసినట్లు చెప్పుకొచ్చారు.50 మందికి పైగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రి పదవుల కేటాయింపులో రెడ్డి వర్గానికి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నప్పుడు మరియు మిగతా ప్రాంతాల నుండి ఒత్తిడి ఉంటే ముందు వారికే ప్రధాన కేటాయింపు చేయమని సీఎం జగన్‌తో అన్నట్లు చెప్పుకొచ్చారు.






