ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ..! ముగ్గేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-10 08:30:52  IST  )

‘పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టాన్నే నమ్ముకుని సామ్రాజ్యాలను నిర్మించినా.. ఆయన స్టైలే సపరేటు!

ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ..! ముగ్గేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ‘పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టాన్నే నమ్ముకుని సామ్రాజ్యాలను నిర్మించినా.. ఆయన స్టైలే సపరేటు! అసెంబ్లీలో గర్జించినా, బహిరంగ వేదికలపై చిందేసినా అది ‘మల్లారెడ్డి’ (Mallareddy) మార్క్ మాస్ ఎంటర్‌టైన్‌మెంటే. పొలిటికల్ సంచలనం.. మాటలతో వైబ్రేషన్ పుట్టించే మల్లారెడ్డి ఏది చేసినా సంచలనమే. తాజాగా, ఆయన తన సొంత మేడ్చల్ (Medchal) జిల్లాలో సంక్రాంతి వైబ్‌ను తీసుకొచ్చారు. అది కూడా ఎలానో తెలుసా ఏకంగా మహిళల సమక్షంలో ముత్యాల ముగ్గులేసి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఇవాళ మేడ్చల్ జిల్లా పూడూరులో బీఆర్ఎస్ నాయకుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పాల్గొని మల్లారెడ్డి ఉత్సాహంగా.. ఉల్లాసంగా ముగ్గులేశారు. అంతే కాదండోయ్ తాను కెమెరాల్లో కనబడాలంటూ అందరూ పక్కకు జరగండంటూ జోక్ పేల్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story