కేసీఆర్ పార్కులో అన్ని వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి

by Batti.Sumithra |

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని కేసీఆర్ పార్కులో అన్ని వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం కేసీఆర్ పార్కు ఎదుట ధర్నా నిర్వహించారు.

కేసీఆర్ పార్కులో అన్ని వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి
X

దిశ, చెన్నూరు : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని కేసీఆర్ పార్కులో అన్ని వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం కేసీఆర్ పార్కు ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ఉన్న ఏకైక కేసీఆర్ పార్కును మూసివేయడం వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని విమర్శించారు.

బాల్క సుమన్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో లక్షల రూపాయల నిధులు కేటాయించి, అన్ని వసతులతో కేసీఆర్ పార్కును ప్రారంభించి ప్రజలకు, వాకర్స్ సభ్యులకు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ పేరుతో పార్కు ఉందనే ఏకైక ఉద్దేశంతోనే దానిని మూసివేయడం సిగ్గుచేటని విమర్శించారు. అతి త్వరలోనే కేసీఆర్ పార్కును తిరిగి తెరిపించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story