'RRR' విషయంలో కొంచెం బాధ ఉంది.. అలియా భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Disha Web |
RRR విషయంలో కొంచెం బాధ ఉంది.. అలియా భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదలై వారం కావస్తున్నా.. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతోంది. వీక్ డేస్‌లో కూడా సినిమా జోరుగా సాగడంతో రెండో వారం కూడా అంతకంటే ఎక్కువ కలెక్షన్లలే ఉంటాయని టాక్ నడుస్తోంది.

అయితే 'RRR' లో సీత పాత్ర పోషించిన బాలీవుడ్ నటి అలియా భట్ హర్ట్ అయిందని రూమర్స్ వస్తున్నాయి. ఈ కారణంగానే ఆమె ఈ సినిమా గురించి పెద్దగా ఎక్కడా మాట్లాడటంలేదని అంటున్నారు. బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్‌తో పోలిస్తే అలియా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నందు వల్లే ఆమె ఇలా చేస్తోందని టాక్. అంతేకాకుండా అలియా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'RRR' (హిందీ వెర్షన్) రూ. 100 కోట్ల కలెక్షన్ చేసినట్లుగా ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. తర్వాత ఆమె దాన్ని డిలీట్ చేసింది. దాంతో అలియాపై వస్తున్న పుకార్లకు మరింత ఊతమిచ్చినట్లయింది. కాగా, ఆలియా ఈ విషయాలన్ని నిజం కాదంటూ ఇలా రాసుకొచ్చింది.. "ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే స్టెటస్‌లు, పోస్టులు ఆధారంగా అతిగా ఊహించవద్దని అలియా అభ్యర్థించింది. 'RRR' లాంటి గొప్ప చిత్రంలో తాను ఒక భాగమైనందుకు తాను ఎప్పటికీ కృతజ్ఞురాలిని" అని అలియా రాసింది. రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్‌లతో కలిసి నటించడం.. తనకు సీత పాత్ర అంటే చాలా ఇష్టమని పేర్కొంది.

నన్ను బాధపెట్టిన ఏకైక విషయం ఏమిటంటే.. దర్శకుడు రాజమౌళి, 'RRR' బృందం ఈ అద్భుత చిత్రానికి జీవం పోయడానికి సంవత్సరాలుగా కృషి చేశారు. ఈ సినిమాపై కేవలం నా అభిప్రాయాన్ని తెలియజేయలేందటూ ఇలా తప్పుపట్టడం సరికాదని అంది. కాబట్టి దర్శకుడు రాజమౌళితో లేదా 'RRR' టీమ్‌లోని ఎవరితోనూ తాను హర్ట్ కాలేదని అలియా స్పష్టంగా చెప్పింది. ఇకనైనా రూమర్స్ అపుతారని ఆశిస్తున్నాను అని పేర్కొంది.




Next Story

Most Viewed