- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగర ప్రజలకు అలర్ట్.. మరో గంటలో హైదరాబాద్‌కు వర్ష సూచన
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్! వడగాల్పుల తర్వాత నగరంలో ఉరుములతో కూడిన వర్షాలకు అవకాశం. గచ్చిబౌలి, మాధాపూర్, కూకట్‌పల్లి సహా పలు ప్రాంతాల్లో రానున్న గంటలో భారీ వర్షం.

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా భారీ ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న నగర ప్రజలకు తెలంగాణ వెదర్ మ్యాన్ (Telangana Weatherman) బిగ్ అలర్ట్ జారీ చేశారు. మరికొద్ది సేపట్లో నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. దీంతో గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగర వాసులకు ఊరటనిచ్చే వార్తగా నిలిచింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రానున్న గంటలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని 'తెలంగాణ వెదర్ మ్యాన్' తాజా నివేదికలో వెల్లడించారు. ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరించారు.
అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాంతాలు
తెలంగాణ వెదర్ మ్యాన్ నివేదిక ప్రకారం.. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, మాధాపూర్, కూకట్‌పల్లి, రాయదుర్గం, కొండాపూర్, హఫీజ్‌పేట్, తెల్లాపూర్, నానక్‌రామ్‌గూడ వాటి పరిసర ప్రాంతాల్లో రానున్న ఒక గంటలో ఉగ్రరూపం దాల్చే ఉరుములతో కూడిన వర్షాలు (Intense Thunderstorms) పడే అవకాశం ఉంది. ఈ మేఘాలు క్రమంగా నగరం అంతటా విస్తరించే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు, కార్యాలయాల నుండి ఇంటికి వెళ్లే వారు తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని వెదర్ మ్యాన్ సూచించారు.






