టీఆర్పీ గద్దె కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆకుల హనుమాండ్లు

by Ratna Kumari |

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఆర్పీ పార్టీ గద్దె కూల్చివేత ఘటనపై టీఆర్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల హనుమాండ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్పీ గద్దె కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆకుల హనుమాండ్లు
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఆర్పీ పార్టీ గద్దె కూల్చివేత ఘటనపై టీఆర్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల హనుమాండ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 5న భువనగిరిలో జరిగిన తీన్మార్ మల్లన్న సభకు వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్వలేకనే గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి 11 గంటల తర్వాత టీఆర్పీ గద్దెను కూల్చివేశారని ఆయన ఆరోపించారు. సమీపంలో ఇతర పార్టీల జెండాలు, గద్దెలు ఉన్నప్పటికీ వాటిని వదిలేసి కేవలం టీఆర్పీ గద్దెనే లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు.

తీన్మార్ మల్లన్న బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నారని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని హనుమాండ్లు ఆరోపించారు. ఈ తరహా ఘటనలు పునరావృతమైతే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. గద్దె కూల్చివేత ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను సంప్రదించగా తాను సెలవులో ఉన్నానని, ఇన్‌చార్జి కమిషనర్‌ను అడగగా తమకు సమాచారం లేదని చెప్పారని పేర్కొన్నారు. అధికారులకు తెలియకుండా ఇలాంటి ఘటన ఎలా జరిగిందని ప్రశ్నించారు.

ప్రభుత్వ ఉద్యోగులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని, తప్పులు చేసిన అధికారుల వివరాలను నమోదు చేస్తున్నామని అన్నారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ తాహెర్, జిల్లా ఉపాధ్యక్షుడు కళ్లెం రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సబ్బిడి రమేష్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story