- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్జాతీయ వేదికపై దేశం పరువు తీస్తారా? కాంగ్రెస్‌పై అఖిలేష్ యాదవ్ ఆగ్రహం!
ఢిల్లీ వేదికగా జరిగిన ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ చేసిన నిరసనలపై SP అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. తీవ్ర అసహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రభుత్వం ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' ను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ చేసిన నిరసనలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ స్థాయి నేతల ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ నిరసన పై ఘాటుగా స్పందించారు. రాజకీయంగా పార్టీల మధ్య ఎన్ని విబేధాలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ వేదికలపై దేశం పరువు తీసేలా ప్రవర్తించడం సరికాదని ఆయన హితవు పలికారు. విదేశీ ప్రతినిధులు, ప్రపంచ స్థాయి నేతల ముందు దేశానికి తలవంపులు తెచ్చే పనులకు కాంగ్రెస్ దూరంగా ఉండాల్సిందని అఖిలేష్ అభిప్రాయపడ్డారు.
అఖిలేష్ వ్యాఖ్యలతో పాటు ప్రతిపక్షంలోని ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ తీరును తప్పుబడుతున్నాయి. నిరసనలు తెలిపేందుకు వేరే మార్గాలు ఉన్నాయని, కానీ అంతర్జాతీయ అతిథుల ముందు ఇలాంటి 'షర్ట్‌లెస్' నిరసనలు చేయడం దేశ గౌరవానికి భంగం కలిగిస్తుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి వంటి నేతలు మండిపడ్డారు. ఒకవైపు సమ్మిట్ నిర్వహణ లోపాలపై అఖిలేష్ విమర్శలు చేస్తున్నప్పటికీ, దేశ ప్రతిష్ట విషయంలో మాత్రం కాంగ్రెస్ చర్యను ఆయన బహిరంగంగానే ఖండించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.






