అశేష జనవాహిని మధ్య అజిత్ 'దాదా' అంతిమయాత్ర.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-29 09:07:32  IST  )

బారామతి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర రాజకీయ ధ్రువతార, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

అశేష జనవాహిని మధ్య అజిత్ దాదా అంతిమయాత్ర.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
X

దిశ, వెబ్ డెస్క్: బారామతి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర రాజకీయ ధ్రువతార, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో పూర్తి అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉదయం అశేష జనవాహిని మధ్య ఆయన అంతిమయాత్ర సాగింది. పూలతో అలంకరించిన ప్రత్యేక రథంపై 'అజిత్ దాదా అమర్ రహే' అనే నినాదాల మధ్య బారామతి పురవీధుల్లో ఆయన భౌతికకాయాన్ని ఊరేగించారు. తమ ప్రియతమ నేతను చివరిసారిగా చూసుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల కన్నీటి వీడ్కోలు తో బారామతి నగరం శోకసంద్రమైంది.

తరలివచ్చిన రాజకీయ దిగ్గజాలు..

ఈ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే సహా పలువురు ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. అజిత్ పవార్ చిన్నాన్న, ఎన్సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే, సుప్రియా సూలే, ఇతర కుటుంబ సభ్యులు అత్యంత భావోద్వేగంతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. మహారాష్ట్ర అభివృద్ధిలో అజిత్ పవార్ పోషించిన పాత్ర అద్వితీయమని, ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటని నేతలు కొనియాడారు. అంతిమ సంస్కారాల సమయంలో త్రివర్ణ పతాకాన్ని అజిత్ పవార్ కుమారుడు జయ్ పవార్‌కు అధికారులు అందజేశారు. ఆయనకు భార్య సునేత్ర పవార్, కుమారులు జయ్, పార్థ్ ఉన్నారు.

Similar News : Ajit Pawar: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. పైలట్ల చివరి మాటలు ఇవే!

Next Story