Ajit Pawar: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. పైలట్ల చివరి మాటలు ఇవే!

by Prasad Jukanti |   (  Updated:2026-01-29 09:06:24  IST  )

అజిత్ పవార్ ప్రమాదానికి గురైన విమానం కాక్ పిట్‍లో పైలట్లు చివరిగా మాట్లాడిన మాటలను డీజీసీఏ అధికారి వెల్లడించారు.

Ajit Pawar: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. పైలట్ల చివరి మాటలు ఇవే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమాన ప్రమాదంపై (Ajit Pawar Plane Crash) దేశ రాజకీయాల్లో ఓ సందేహంగా మారింది. బారామతిలో (Baramati) మరి కొన్ని క్షణాల్లో ల్యాండ్ అవ్వాల్సిన విమానం అనూహ్యంగా రన్ వేకు అత్యంత సమీపంలో కుప్పకూలడం ఈ ఘటనలో అజిత్ పవార్‍తో పాటు మరో నలుగురు మృత్యువాత పడటం అంతులేని విషాదంగా మారింది. అయితే ఈ విమానం కూలిపోవడానికి ముందు ఏం జరిగిందనేదానిపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చివరి క్షణంలో ప్రమాదాన్ని గుర్తించిన ఫ్లై పైలట్లు 'ఓహ్ షి**' అన్నట్లు తెలిసిందని డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)కు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ ఆయన కాక్ పిట్ నుంచి చివరిగా వినిపించిన మాటలు ఇవే అని వెల్లడించినట్లు ఈ కథనం పేర్కొంది. బారామతి విమానాశ్రయంలోని గ్రౌండ్ కంట్రోల్‌ను రెడ్‌బర్డ్ ఏవియేషన్, కార్వర్ ఏవియేషన్ అనే రెండు ప్రైవేట్ ఫ్లయింగ్ అకాడమీలకు చెందిన పైలట్ క్యాడెట్లు నిర్వహిస్తున్నారని, వారితోనే అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం పైలట్లకు కమ్యూనికేషన్ జరిగిందని ఆ అధికారి చెప్పారు.

తుది రిపోర్ట్ పై ఉత్కంఠ:

కాగావీఎస్ఆర్ వెంచర్స్ కు చెందిన ఈ ప్రైవేట్ ఫ్లైట్ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు విమానం ప్రధాన పైలట్ (పైలట్ ఇన్ కమాండ్) సుమిత్ కపూర్, రెండో పైలట్ (ఫస్ట్ ఆఫీసర్) శాంభవి పాఠక్, సిబ్బంది పింకీ మాలి, పవార్ వ్యక్తిగత భద్రతాధికారి విదీప్ జాధవ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై లోతైన విచారణ కోసం విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB)కి చెందిన ప్రత్యేక బృందం బుధవారం సాయంత్రం ప్రమాద స్థలాన్ని సందర్శించి ఫోరెన్సిక్ దర్యాప్తు ప్రారంభించింది. అయితే అజిత్ పవార్ మరణం వెనకాల కుట్ర కోణం ఉందనే అనుమానాలు సైతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి దర్యాప్తులో ఈ ప్రమాదానికి గల కారణాలు ఏం తేలబోతున్నాయనేదో వేచి చూడాలి. మరో వైపు ఇవాల అజిత్ పవార్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి.

Similar News : అశేష జనవాహిని మధ్య అజిత్ 'దాదా' అంతిమయాత్ర.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

Next Story