ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ ఇస్తోన్న ఎయిర్‌టెల్

by Disha Web |
ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ ఇస్తోన్న ఎయిర్‌టెల్
X

దిశ,వెబ్‌డెస్క్: టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ వినియోగదారులను ఆకట్టుకొడానికి కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వస్తుంది. ఇప్పుడు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వాలను అందించడానికి రిచార్జ్ ప్లాన్‌లను తెచ్చింది. కస్టమర్‌లు ప్రత్యేకంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయనవసరం లేకుండా ఎంపిక చేసిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఎయిర్‌టెల్ అందిస్తోంది.

Airtel రూ.1199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో ఉచిత నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఇంతకు ముందు ధర రూ. 999. కానీ ఈ ప్లాన్ ధరను పెంచి రూ.1199 చేశారు. ఇది డేటా రోల్‌ఓవర్ సౌకర్యం, అపరిమిత లోకల్, STD కాలింగ్, రోజుకు 100 SMSలతో గరిష్టంగా 150 GB డేటాను అందిస్తోంది. పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో కస్టమర్‌లు డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లకు ఉచిత సభ్యత్వాలను కూడా పొందుతారు.

ఎయిర్‌టెల్.. రూ.1599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో ఉచిత నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు, కస్టమర్‌లు అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లకు ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందుతారు. అపరిమిత లోకల్, STD, రోమింగ్ కాల్‌లు, 500GB వరకు డేటా రోల్‌ఓవర్, సబ్‌స్క్రిప్షన్‌తో అపరిమిత కాల్‌లతో ఉచిత యాడ్-ఆన్ కనెక్షన్‌ను పొందుతారు. పూర్తి వివరాల కోసం అధికారిక Airtel వెబ్‌సైట్ లేదా Airtel థాంక్స్ యాప్‌ని సందర్శించవచ్చు.

Next Story