- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో మరోసారి పడిపోయిన గాలి నాణ్యత
హైదరాబాద్‌లో క్షీణించిన గాలి నాణ్యత. పటాన్‌చెరు రామేశ్వరం బండలో 251గా నమోదైన AQI. కాలుష్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ (Hyderabad) నగరంలో మరోసారి గాలి నాణ్యత (air quality) పడిపోయింది. ఈ రోజు ఉదయం భాగ్యనగరంలో గాలి నాణ్యత ఆందోళనకర స్థాయికి చేరింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా సురక్షితమైన రెండంకెల స్థాయిలో ఉండాల్సిన గాలి నాణ్యత సూచీ (AQI), శుక్రవారం పటాన్‌చెరు పరిధిలోని రామేశ్వరం బండలో (Rameshwaram banda) అత్యధికంగా 251గా నమోదైంది. ఇది "అత్యంత అనారోగ్యకరమైన" (Unhealthy) స్థాయిగా అధికారులు పేర్కొంటున్నారు.
నగరంలో నిత్యం నిర్మాణ పనులు, పెరుగుతున్న వాహనాల రద్దీ (Vehicular traffic) వల్ల వస్తున్న దుమ్ము, నగర శివార్లలో చెత్తను తగలబెట్టడం వంటి కారణాల వల్ల గాలిలో ప్రమాదకరమైన నైట్రోజన్ డయాక్సైడ్, పీఎం 2.5 రేణువుల శాతం పెరుగుతోంది. ముఖ్యంగా తెల్లవారుజామున, రాత్రి వేళల్లో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, అనవసరమైన అవుట్‌డోర్ కార్యకలాపాలను తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.






