సింహం గుర్తుతోనే జాగృతి పోటీ.. ప్రకటించిన AIFB స్టేట్ చీఫ్ లతీఫ్

by Kema Shiva Kumar |

మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థుల పోటీ చేయనున్నారు.

సింహం గుర్తుతోనే జాగృతి పోటీ.. ప్రకటించిన AIFB స్టేట్ చీఫ్ లతీఫ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థుల పోటీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జావెద్ లతీఫ్, ఉపాధ్యక్షులు కె.బుచ్చిరెడ్డి ప్రకటించారు. తెలంగాణ జాగృతి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతల చర్చలు చర్చించారు. మున్సిపల్ ఎన్నికలతోపాటు భవిష్యత్‌లోనూ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుుకున్నారు. బుధవారం సాయంత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఏఐఎఫ్‌బీ రాష్ట్ర చైర్మన్ జావెద్ లతీఫ్, కన్వీనర్ జోజిరెడ్డి, ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డి, సెంట్రల్ కమిటీ సభ్యులు ఆర్‌వీఆర్ ప్రసాద్, కొండ దయానంద్, ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి తేజ్‌దీప్‌రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ కె.నరేందర్, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజుగౌడ్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బీరన్న, నల్గొండ ప్రధాన కార్యదర్శి రాము, ఐవైఎల్ స్టేట్ ప్రెసిడెంట్ ఆదిత్య, జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి సహా ముఖ్యనేతలు సమావేశం అయ్యారు. ఈ మేరకు ఈ నిర్ణయం ప్రకటించారు.

Next Story