AI కొత్త టెక్నాలజీ.. ఆ ఉద్యోగాలు గోవిందా!

by Muthe.Rajitha |

ప్రస్తుతం టెకీల జీవితాల్లో AI ఎంతగా భాగస్వామ్యం అయిందో తెలిసిందే.

AI కొత్త టెక్నాలజీ.. ఆ ఉద్యోగాలు గోవిందా!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం టెకీల జీవితాల్లో AI ఎంతగా భాగస్వామ్యం అయిందో తెలిసిందే. అంతేకాదు AI లో కూడా కొత్త కొత్త వెర్షన్లు, టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. AI వల్ల అనేక ఉద్యోగాలు పోయే పరిస్థితి ఎదురవ్వడం ఖాయం అనేది నిజమవుతూ వస్తుండగా.. రాబోయే రోజుల్లో AI సాంకేతికత వల్ల డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఉండవని చెబుతున్నారు SAP CEO. రానున్న మూడేళ్ళలో కీబోర్డులు కనుమరుగవుతాయని, AI, LLM తో వాయిస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అద్భుతంగా పని చేస్తుందని SAP CEO క్రిస్టియన్ క్లేన్ తెలిపారు. దీంతో డేటా ఎంట్రీ కోసం టైపింగ్ అవసరం ఉండదని, ఇందుకు సంబంధించిన ఉద్యోగాలు కూడా కనుమరుగవుతాయని అన్నారు.

కాగా 1714 లో హెన్రీ మిల్ టైప్ రైటర్ కాన్సెప్ట్ తో మొదలైన 312 ఏళ్ల కీ బోర్డు ప్రస్థానం అతి త్వరలో వాయిస్ కమాండ్స్ తో ముగియనుందని పేర్కొన్నారు. మాట్లాడటం ద్వారానే సాఫ్ట్వేర్ సిస్టమ్స్ తో పనులు జరుగుతాయని క్లేన్ వెల్లడించారు.

Next Story