నాన్నతో కలిసి పనిచేయడం ఇష్టం లేదు.. యంగ్ హీరో

by Disha Web Desk 17 |
నాన్నతో కలిసి పనిచేయడం ఇష్టం లేదు.. యంగ్ హీరో
X

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి 'తడప్‌' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి చిత్రంలోనే అమేజింగ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో.. తండ్రి సునీల్ శెట్టి తన సినిమాలు నిర్మించడం ఇష్టం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అహన్.. 'మా నాన్న పై ఒత్తిడి పెంచాలని అనుకోవట్లేదు. ఇండస్ట్రీ లేదా ఇతర ఏ రంగమైనా కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తున్నప్పుడు వృత్తిలో నైపుణ్యాన్ని కోల్పోతారు. ఎందుకంటే ప్రతీ అవుట్‌పుట్ అద్భుతంగా రావాలనుకుంటారు. కొత్త ఆలోచనలు, సూచనలు చేసే విషయంలో నొప్పించకుండా వారితో ఏకీభవిస్తారు. అందుకే రిలేషన్స్, వృత్తిపరమైన జీవితాల మధ్య విభజన రేఖ స్పష్టంగా ఉండాలి' అని వివరించాడు. అయినప్పటికీ భవిష్యత్తులో తండ్రితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed