Viral Video: కచా బాదం తర్వాత భారీగా వైరలవుతున్న వీడియో ఇదే!

by Dishanational1 |
Viral Video: కచా బాదం తర్వాత భారీగా వైరలవుతున్న వీడియో ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్: కచా బాదం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. అయితే, ప్రస్తుతం అలాంటి ఓ వీడియో భారీగా వైరల్ అవుతోంది. కచా బాదం పాటలో మాదిరిగా ఓ పండ్ల వ్యాపారీ కూడా పాట పాడుతూ పండ్లు విక్రయిస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. వైరల్ అయిన కచా బాదం విక్రయదారుడిలానే, వృద్ధుడు తన ద్రాక్షను అమ్మడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక రాగం వినిపిస్తూ కనిపిస్తాడు. నల్ల ద్రాక్ష మరియు జామపండ్లను అమ్ముతూ కూర్చున్న అతను, చేతిలో కప్పు టీ పట్టుకుని, లేలో 15 రూపాయలకే 12 అంగూర్ అని పాట పాడుతాడు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. వాహ్.. బాగుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed