- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరి మృత్యువు ఒడిలోకి
మాడుగులపల్లి మండల పరిధిలోని కుక్కడం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అవంతిపురం గ్రామానికి చెందిన చామర్తి ఉపేంద్ర చారి మృతి చెందాడు.

దిశ, మాడుగులపల్లి : మాడుగులపల్లి మండల పరిధిలోని కుక్కడం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అవంతిపురం గ్రామానికి చెందిన చామర్తి ఉపేంద్ర చారి మృతి చెందాడు. మాడుగులపల్లి ఎస్సై ఎస్ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం అవంతిపురం గ్రామానికి చెందిన చామర్తి ఉపేంద్ర చారి కొత్తగూడెం గ్రామంలోని శ్రీ బాలాజీ వేర్‌హౌసింగ్ అండ్ లాజిస్టిక్స్ గోడౌన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో తన విధులు ముగించుకొని తన ద్విచక్ర వాహనం పై ఇంటికి బయలుదేరాడు.
ఈ క్రమంలో కుక్కడం గ్రామ శివారులోని ఈద్గా సమీపంలో తన ముందు వెళ్తున్న మరో బైక్ ను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ దిమ్మెలను ఢీ కొట్టడంతో ఉపేంద్ర చారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాడుగులపల్లి ఎస్సై ఎస్. కృష్ణయ్య తెలిపారు. ఈ ఘటనతో అవంతిపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు.






