సర్కార్ స్కూల్‌లో అడ్మిషన్.. తల్లిదండ్రులకు డబుల్ బెనిఫిట్

by Batti.Sumithra |

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను అడ్మిషన్లను పెంచడం, విద్యను ప్రోత్సహించడమే ధ్యేయంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

సర్కార్ స్కూల్‌లో అడ్మిషన్.. తల్లిదండ్రులకు డబుల్ బెనిఫిట్
X

దిశ, పర్వతగిరి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను అడ్మిషన్లను పెంచడం, విద్యను ప్రోత్సహించడమే ధ్యేయంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మంగళవారం చౌటపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మట్టపెల్లి వెంకటేశ్వర్ రావు అధ్యక్షతన, ఉపసర్పంచ్ పెసరి దర్గేష్, వార్డు సభ్యుల సమక్షంలో అత్యవసర గ్రామపంచాయతీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రెండు ముఖ్యమైన ఏకగ్రీవ తీర్మానాలను ఆమోదించినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ తీసుకుని, చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు ఇంటి పన్ను, నల్లా (వాటర్) పన్నును పూర్తిగా మినహాయిస్తున్నట్లు తీర్మానించారని తెలిపారు.

ప్రస్తుతం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో మొదటి రెండు స్థానాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను వారికి రూ.5,116/- నగదు బహుమతిని అందించాలని తీర్మాణం చెసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మట్టపెల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన ప్రభుత్వ విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, గ్రామస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ పిల్లలను చౌటపల్లి ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి పన్ను మినహాయింపులు, బహుమతులు పొందాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి అశోక్ నాయక్ ఉప సర్పంచ్‌ తో పాటు వార్డు సభ్యులైన చిడిమిల్ల అశోక్, చామంతుల లక్ష్మి, మట్టపెల్లి నిఖిల్ రావు, గౌరారపు నరసింహస్వామి, గౌరారాపు అయిలయ్య, నాతి నర్సమ్మ, రాజబోయిన అరుణ, చెన్నూరి సుభద్ర, దామెర రమ పంచాయతీ సిబ్బందిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Next Story