మంత్రి సీతక్క, కోదండరాంను కలిసిన ఆదివాసీ నాయకులు.. కారణం ఏంటంటే?

by Jakkula.Mamatha |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనులకు సంబంధించిన పలు కీలక సమస్యలపై తుడుందెబ్బ నాయకులు గురువారం మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను కలిసి వినతిపత్రం సమర్పించారు.

మంత్రి సీతక్క, కోదండరాంను కలిసిన ఆదివాసీ నాయకులు.. కారణం ఏంటంటే?
X

దిశ,పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనులకు సంబంధించిన పలు కీలక సమస్యలపై తుడుందెబ్బ నాయకులు గురువారం మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను కలిసి వినతిపత్రం సమర్పించారు. తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్తి రాజు, జాతీయ ఉపాధ్యక్షుడు కోడేం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వీరాపురం ఇసుక రీచ్‌కు సంబంధించి ప్రస్తుతం రెండు గిరిజన సహకార సంఘాల మధ్య కొనసాగుతున్న వివాదాన్ని నిష్పాక్షికంగా పరిష్కరించాలని కోరారు. రెండు ఆదివాసీ సంఘాలకు సమన్యాయం జరిగే విధంగా ప్రభుత్వం, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే పోడు భూముల సమస్యలు, గిరిజనుల జీవనోపాధి, ఏజెన్సీ ప్రాంతాల్లో వలసల ప్రభావం తదితర అంశాలను మంత్రి, ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీగిరి లక్ష్మి ఇసుక క్వారీ ట్రైబల్ లేబర్ కాంట్రాక్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులు కూడా పాల్గొని వీరాపురం ఇసుక రీచ్‌కు సంబంధించిన తమ సమస్యలను వారికి వివరించారు. గిరిజన హక్కులు, జీవనోపాధి, పోడు భూముల పరిరక్షణకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారని గిరిజన నాయకులు తెలిపారు.

Next Story