- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, సినిమా: బాలీవుడ్ నటి యామీ గౌతమ్ లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలకు మద్దతుగా నిలుస్తోంది. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె.. మహిళలపై వేధింపులను అరికట్టేందుకు మజ్లిస్, పారి (పీపుల్ ఎగైనెస్ట్ రేప్ ఇన్ ఇండియా) అనే రెండు ఎన్‌జీవోలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో దేశం ఎంత అభివృద్ధి చెందుతున్న మహిళల గురించి ఆలోచించే ధోరణిలో పెద్దగా మార్పులు రావట్లేదని అభిప్రాయపడింది.
'లైంగిక వేధింపుల బాధితులకు అండగా నిలిచేందుకు రెండు ఎన్‌జీవోలతో కలసి పనిచేయడం గర్వంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీల భద్రత, సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఎంతో ఉంది. గవర్నమెంట్లు చర్యలు తీసుకుంటున్నా.. మరింత కృషి చేయాల్సి ఉంది. అన్ని వర్గాల మహిళలను రక్షించడానికి అవసరమైన వసతుల కల్పనకు మరింత సహకారం అందించాలి' అని అభిప్రాయపడింది. అలాగే పసిపాపల నుంచి మొదలుకుని వృద్ధులను కూడా వదలకుండా లైంగికంగా వేధిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
https://www.instagram.com/p/CJLA7NVlmLR/?utm_source=ig_web_copy_link






