ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది.. బోల్డ్ బ్యూటీ సంచలన కామెంట్స్

by Disha Web Desk 19 |
ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది.. బోల్డ్ బ్యూటీ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హిందీ బిగ్ బాస్ ఫేమ్, ఆర్టిస్ ఉర్ఫీ జావేద్ తన డ్రెస్సింగ్ స్టైల్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. సోషల్ మీడియాలో ప్రతిరోజు సరికొత్త గెటప్‌లో దర్శనమిచ్చే ఈ హాట్ బ్యూటీ.. తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. 'నా డ్రెస్సింగ్ గురించి ఎవరు ఎన్ని కామెంట్లు చేసిన పట్టించుకోను.. ఇంతే బోల్డ్‌గా ఉంటానంది ఈ అందాల భామ. నేను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డా.. కానీ ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రాలేదు. నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే చూసారు అని ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను ఫ్యాషన్ రంగం వైపు వద్దనందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేశా.. ఇప్పుడు ఎవరో కామెంట్లు చేశారనీ వెనక్కి తగ్గను. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు నా ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొ్న్నా.. కొన్ని సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించేదని ఈ హాట్ బ్యూటీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

Next Story

Most Viewed