Shivathmika: బాయ్ ఫ్రెండ్‌తో లేచిపోయింది నేనా.. మా అక్కనా..? క్లారిటీ ఇచ్చిన శివాత్మిక

by Disha Web Desk 19 |
Shivathmika: బాయ్ ఫ్రెండ్‌తో లేచిపోయింది నేనా.. మా అక్కనా..? క్లారిటీ ఇచ్చిన శివాత్మిక
X

దిశ, వెబ్‌డెస్క్: రాజశేఖర్, జీవితల గారలపట్టి శివాత్మిక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలపై నెట్టింట తీవ్ర దుమారం రేగింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఇటివల దుబాయ్ వెళ్లిన ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటికి కొందరు నెటిజన్లు హద్దులు మీరి.. శివాత్మిక బాయ్ ఫ్రెండ్‌తో లేచిపోయిందని.. ఇలా రకరకాల కామెంట్లు చేశారు.

ఇంటర్ నెట్‌లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారడంతో ఆమె వాటిపై క్లారిటీ ఇచ్చింది. ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు దుబాయ్‌లో ఫ్యామిలీతో దిగిన ఫొటోను షేర్ చేసింది ఈ హాట్ బ్యూటీ. ' నేను దుబాయ్ వెళ్లింది వీళ్లతోనే.. ఇప్పుడు చెప్పండి.. అసలు బాయ్ ఫ్రెండ్ ఎవరు..? బాయ్ ఫ్రెండ్‌తో లేచిపోయింది నేనా..? శివానినా ప్లీజ్ చెప్పిండి. అసలు ఈ న్యూస్ నెక్స్ట్ లెవల్. రూమర్స్ రాసేటప్పుడు క్లారిటీగా ఉండండి. నాన్ సెన్స్ రూమర్స్' అంటూ శివాత్మిక ఫైర్ అయింది.

ఇదిలా ఉంటే ఈ హాట్ బ్యూటీ దొరసాని సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోయిన.. ఈ అందాల భామ యాక్టింగ్‌కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం శివాత్మిక, కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండలో నటిస్తోంది.





Next Story

Most Viewed