ముస్లింలకు క్షమాపణలు చెప్పిన నటి.. అతడిని అలా అన్నందుకే!

by Disha Web |
ముస్లింలకు క్షమాపణలు చెప్పిన నటి.. అతడిని అలా అన్నందుకే!
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'లాక్ అప్' అనే రియాల్టీ షో రోజురోజుకు ఆసక్తికరంగా సాగుతోంది. ఎలిమినేషన్ నుండి తప్పించుకునేందు సెలబ్రిటీలు రివీల్ చేసే సీక్రెట్లు.. వారి మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు షోను మరో రేంజ్‌కు తీసుకెళ్తున్నాయి. తాజాగా నటి, లాక్ అప్ కంటెస్టెంట్ పాయల్ రోహత్గీ షోలో తోటి కంటెస్టెంట్ జీషన్ ఖాన్‌‌ను టెర్రరిస్ట్‌ అన్న వివాదంపై స్పందించింది.

వీరిద్దరి మధ్య 'హలాల్' విషయంపై జరిగిన గొడవ గురించి పాయల్ మాట్లాడుతూ.. 'నేను ఎవరి మనోభావాలను కించపరిచినా.. లేదా ఒక ప్రత్యేక సంఘం యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడినా వారికి క్షమాపణలు చెబుతున్నా.. నన్ను క్షమించండి. అంతేకాని దీనిని పెద్ద వివాదంగా సృష్టించవద్దని వేడుకుంటున్నా. ఇక్కడితో ఇది ముగిస్తారని అనుకుంటున్నా' అంటూ భారతీయ ముస్లింలకు క్షమాపణలు చెప్పింది.

టాలీవుడ్‌లో అతడే నా ఫేవరెట్ హీరో: రకుల్ ప్రీత్ సింగ్

Next Story

Most Viewed