పార్లమెంట్‌లో కమల్ తెలుగు ప్రసంగం.. ‘తమిళులకు అవమానం’ అంటూ నటి కస్తూరి ఫైర్

by Malleboina Mahesh |

తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టిన సీనియర్ హీరో కమల్ హాసన్ పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే పార్టీ తో పొత్తు పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఆయన్ను డీఎంకే పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.

పార్లమెంట్‌లో కమల్ తెలుగు ప్రసంగం.. ‘తమిళులకు అవమానం’ అంటూ నటి కస్తూరి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టిన సీనియర్ హీరో కమల్ హాసన్ (Hero Kamal Haasan) పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే పార్టీ తో పొత్తు పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఆయన్ను డీఎంకే పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. అయితే మొదటిసారి కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్.. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ పరిణామం ప్రస్తుతం తమిళనాడులో తీవ్ర చర్చ తో పాటు కొత్త వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో భారతీయ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి ఈ వివాదంపై స్పందిస్తూ.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, తమిళ ప్రజల ఓట్లతో గెలిచి పార్లమెంటుకు వెళ్లిన కమల్, అక్కడ తమిళ భాషను పక్కన పెట్టి తెలుగులో మాట్లాడటం తమిళులను అవమానించడమేనని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

కమల్ హాసన్ చర్యను తప్పుబడుతూ.. కేవలం పొరుగు రాష్ట్రాల్లో తన పాపులారిటీని పెంచుకోవడానికే ఆయన ఇలా చేశారని బీజేపీ నేత కస్తూరి (BJP leader Kasturi) ఆరోపించారు. తమిళనాడులో ఎప్పుడు తమిళ భాషా అస్తిత్వం గురించి మాట్లాడే కమల్, ఢిల్లీ వేదికపై తన మాతృభాషను విస్మరించడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు. తమిళ సంస్కృతిని, భాషను ప్రపంచానికి చాటాల్సిన చోట ఇతర భాషలకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని ఆమె ప్రశ్నించారు. గతంలో కస్తూరి తెలుగు వారిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, ఇప్పుడు ఆమె మళ్ళీ భాషా సెంటిమెంట్‌ను లేవనెత్తడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇంతకీ కమల్ హాసన్ సభలో ఎమ్ మాట్లాడారంటే..?

రాజ్యసభలో తన మొదటి బడ్జెట్ సెషన్ (Budget session) లో పాల్గొన్న కమల్ హాసన్ స్పీకర్ కు ధన్యవాదాలు చెప్పి.. "వస్తున్నాయి.. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. నా ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా బాగా అర్థమవుతాయని కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ వ్యాఖ్యలు ఆయన త్వరలో ఏపీ మాజీ సీఎం జగన్ చేసే పాదయాత్రను ఉద్దేశించి అన్నారని కొందరు విమర్శిస్తున్నారు. కానీ ఆయన మద్దతుదారులు స్పందిస్తూ.. కమల్ అన్ని భారతీయ భాషలను సమానంగా గౌరవిస్తారని, ఒక దక్షిణాది భాషలో ప్రసంగించడం ద్వారా ఆయన ప్రాంతీయ సమగ్రతను చాటారని వారు సమర్థిస్తున్నారు.

Next Story